You are currently viewing పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే   -నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి   సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే  -నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత

నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 10:


పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు శుక్ర‌వారం జిల్లా ఎస్పీకె.రఘువీర్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవియన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది మొత్తం 7 మంది మ్యూచువల్ ట్రాన్స్‌ఫ‌ర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీల గురించి జిల్లా ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ సిబ్బంది సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా కల్పించారు. సిబ్బంది యొక్క ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత జిల్లా పోలీసు కార్యాలయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిసి ఫయాజ్ భాష పాల్గొన్నారు.