నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 10: జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ, సఫాయి కమిషన్ సభ్యుడు బాయికాటి ప్రహల్లాద్ శుక్రవారం ఆసుపత్రిలో వారితో సమావేశం నిర్వహించారు. మొదటి సారి ఆసుపత్రికి వచ్చిన ప్రహల్లాద్‌ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాదరావు, చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీ సూపర్వైజర్లు నరసింహులు, సురేష్, సల్మాబేగం, మధు తదితరులు సన్మానించారు. అనంతరం ప్రహల్లాద్ కార్మికులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విధినిర్వహణలో సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
