You are currently viewing ఈనెల 20వ తేదీ లోపు ఖ‌చ్చితంగా డిఈఓ కార్యాల‌యంలో ధృవీకరించు పత్రాలు అంద‌జేయాలి -డిఈఓ అనురాధ‌

ఈనెల 20వ తేదీ లోపు ఖ‌చ్చితంగా డిఈఓ కార్యాల‌యంలో ధృవీకరించు పత్రాలు అంద‌జేయాలి -డిఈఓ అనురాధ‌

నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 10: ఈనెల 5వ తేదీ జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఈనెల 20వ తేదీ లోపు ఖ‌చ్చితంగా వారి కుల, ఆదాయ, అంగవైకల్యం ఉన్న విద్యార్థులు వైకల్యం ధృవీకరించు పత్రములను మొదలైనవి సిద్ధం చేసుకోవాలని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ పత్రముల ధృవీకరణ కొరకు త్వరలో ప్రెస్ నోట్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం విడుదల చేసి కార్యాలయపు వెబ్సైట్ నందు ఉంచడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్‌ను గమనించుకోవాలన్నారు. అర్హత క‌లిగిన‌ విద్యార్థుల యొక్క పత్రాలను సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి వారు అడిగిన వెంటనే కార్యాలయంలో హాల్ టికెట్ జిరాక్స్ కాపీతో సహా అన్ని పత్రములను గడువు తేదీలోపు అందజేయాలన్నారు. ఇచ్చిన తేదీకి లోపు ధృవీకర‌ణ నకళ్ల‌ను అందచేయాని విద్యార్థుల యొక్క వివరములు తుది జాబితా నుండి తొలగింపబడుతుందన్నారు. దీనికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు. ఈ పరీక్ష జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి వెబ్సైట్ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయపు వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచబడుతుందని తెలిపారు. తుది జాబితా విడుదల చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎటువంటి అభ్యర్థనలను (స్పందన, కోర్టు వాణిజ్యములు, లోకయుక్త వాణిజ్యములు) గాని స్వీకరింపబడవని డిఈఓ తెలియజేశారు. విద్యార్థి తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గడువు తేదీకి ముందుగానే ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకుని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయమునకు అందజేయాలన్నారు.