You are currently viewing రైతులు ఈనెల‌ 13న రైతు భరోసా కేంద్రాలలో తమ పేరు నమోదు చేసుకొవాలి  -జాయింట్ క‌లెక్ట‌ర్ టి.నిశాంతి

రైతులు ఈనెల‌ 13న రైతు భరోసా కేంద్రాలలో తమ పేరు నమోదు చేసుకొవాలి -జాయింట్ క‌లెక్ట‌ర్ టి.నిశాంతి

నంద్యాల బిఎన్ న్యూస్, ఫిబ్ర‌వ‌రి 10: ర‌బీ సాగు గాను నంద్యాల జిల్లాలో శ‌నగలు 25 మండలాలలో 116971 ఎకరాలలో 31924 మంది రైతులు పంట నమోదు చేసుకున్నారు. శనగ పంట 306983.59 ఎంటిఎస్ వస్తుందని అంచనా వేశారు. శుక్ర‌వారం రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ / నాన్ ఫెడ్‌ ఆధ్వర్యంలో శ‌నగలు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్ రూ.5335తో కొనుగోలు చేయుటకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రాప్, ఈ కేవైసీ చేయించుకున్న రైతులు ఫిబ్రవరి 13న రైతు భరోసా కేంద్రాలలో తమ పేరు నమోదు చేసుకోగలరని జాయింట్ క‌లెక్ట‌ర్ టి.నిశాంతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ రైతు సోదరులు తమ సమీప రైతు భరోసా కేంద్రాలలో తమ వివరాలు నమోదు చేయించుకోవాల‌న్నారు. రైతు సోదరులు తమ పంటను ఈ క్రాప్, చేయించుకున్న వారు మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు. శనగలు కొనుగోలు ఫిబ్రవరి 23 తర్వాత ప్రారంభం అవుతాయ‌ని తెలియ‌జేశారు.