You are currently viewing పాత్రికేయుని అరెస్టుపై ఏపీయూడబ్ల్యూజే నిరసన

పాత్రికేయుని అరెస్టుపై ఏపీయూడబ్ల్యూజే నిరసన

  • Post category:Nandyal

సీనియర్ పాత్రికేయులు అంకబాబుపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ శనివారం ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఖండే శ్యాంసుందర్, చలం బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులకు అంకబాబు పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కండే శ్యామ్ మాట్లాడుతూ పాత్రికేయులపై అక్రమ అరెస్టులతో ప్రభుత్వం పై విమర్శలను ఆపలేరు అన్నారు. అర్ధరాత్రిలు 73 ఏళ్ల వయసు ఉన్న సీనియర్ పాత్రికేయులు అంకబాబును ఉగ్రవాదుల వలె అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు జనార్దన్ రెడ్డి, మధు, కనకరాజు, అబ్దుల్, జావిద్, చోటు, విద్యార్థి సంఘాల నాయకులు రాజు నాయుడు పాల్గొన్నారు.