మట్టి గణనాథుల ఉచిత పంపిణీ
నంద్యాల (BnNews) 31 ఆగష్టు: పట్టణంలోని బాలాకాడమీ రవీంద్ర విద్యా సంస్థలు మట్టి వినాయకుల ప్రతిమలను లక్ష్మీ గణపతి గుడి, ఆత్మకూరు బస్టాండును వేదికగా చేసుకొని ఉదయం 10:30 గంటల నుండి ప్రజలకు ఉచిత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ఎమ్మెల్సీ ఇషాక్ భాష , నంద్యాల జిల్లా అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రమణ , మరియు విశిష్ట అతిథులుగా నంద్యాల ఆర్డీవో శ్రీనివాసులు, నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవి చంద్రారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మట్టి గణపతి స్థాపించడం వలన సహజమైన ప్రకృతి సిద్ధమైన మట్టితో తయారు చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదు. మానవుల్లో సృజనాత్మక కళా నైపుణ్యం తెలుస్తుంది. ఇవి నీటిలో పూర్తిగా కరిగిపోతాయి మట్టి వినాయక ప్రతిమలను నీటిలో కలపడం వలన జలచరాలకు హాని ఉండదు. మట్టి వినాయకుల ప్రతిమల వలన ఇలాంటి చర్మ రోగాలు, కళ్ళ రోగాలు, గుండె జబ్బులు రావు అని ప్రజలలో చైతన్యము కలిగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మరియు అతిధులు తెలియజేశారు.