మండలంలోని చాపిరేవుల గ్రామంలో బుడగ జంగాలకు చెందిన 35 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మంజూరు చేయడం జరిగింది. వారికి జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామున్, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతున్న వాళ్ల జీవితాలు మారడం లేదని వైయస్సార్ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం జరిగిందని శుక్రవారం ఇంటి స్థలాలతో పాటు గృహాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని బుడగ జంగాలకు చెందిన ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని చాపిరేవుల గ్రామంలో 35 మంది బుడగ జంగాల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని మా నాన్న శిల్పా మోహన్ రెడ్డి చాలా కాలం నుండి బుడగ జంగాలకు స్థలాలు ఏర్పాటు చేయాలన్నకలను నేడు నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో పేద ప్రజల కోసం ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు పేద ప్రజలకు రావాల్సిన స్థలాల పై కోర్టుకు వెళ్లడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క అర్హుడైన వారికి ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వాటిని గుర్తించి ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రభాకర్ శెట్టి, సర్పంచ్ దేవి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్స్ పురుషోత్తం రెడ్డి, విజయ శేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు మల్లికార్జున రెడ్డి, ప్రకాశం మహేశ్వర్ రెడ్డి, కొండా రెడ్డి, సుధాకర్ రెడ్డి, బుడగ జంగాల రాముడు తదితరులు పాల్గొన్నారు.

35 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పా రవి
- Post published:July 15, 2022
- Post category:Nandyal