You are currently viewing జిపిఎస్ కార్యాలయం ప్రారంభం – గిరిజనుల కోసం కృషి చేయండి

జిపిఎస్ కార్యాలయం ప్రారంభం – గిరిజనుల కోసం కృషి చేయండి

  • Post category:Nandyal

-ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్

రాష్ట్రంలో ఉన్న గిరిజనుల కోసం పనిచేసే వారి అభ్యున్నతికి జిపిఎస్ కృషి చేయాలని ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు.
బుధవారం నంద్యాల పట్టణంలోని వచ్చిన ఎస్టి కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై నూతనంగా జిపిఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల కోసం జిపిఎస్ నాయకులు గిరిజనుల కోసం కృషి చేయడం సంతోషకరమన్నారు. అందరూ ఐక్యమత్తంగా ఉండి ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. ప్రతి ఒక్క గిరిజనుడు అభివృద్ధి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. గిరిజనుల సమస్యల కోసం, జిపిఎస్ నాయకులకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం వారి అభ్యున్నతికి కమిషన్ సహకరిస్తుందని అన్నారు. ఫిర్యాదు చేస్తే జిపిఎస్ నాయకులు ప్రత్యక్షమై అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలని నాయకులకు కోరారు. ఈ కార్యక్రమంలో జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, టూ టౌన్ సిఐ, త్రీ టౌన్ ఎస్ఐ, జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, రాయలసీమ జిల్లాల ఇన్చార్జి రవీంద్ర నాయక్, 15వ వార్డు వైసిపి ఇన్చార్జి సాయిరాం రెడ్డి, వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, కరివేన రవీంద్ర నాయక్, మరియు నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు