You are currently viewing స్పందన వినతులపై ప్రత్యేక దృష్టి సారించండి

స్పందన వినతులపై ప్రత్యేక దృష్టి సారించండి

  • Post category:Nandyal

రీఓపెన్ అవుతున్న స్పందన అర్జీలకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం

జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో స్వీకరించిన వినతుల పై ప్రత్యేక దృష్టి సారించే నాణ్యతగా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. సోమవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని (ఆర్ఎఆర్ఎస్) వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య తదితర జిల్లాధికారులు నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ స్పందన రీఓపెన్ కేసులకు సంబంధించి సేమ్ ఎండార్స్మెంట్ అప్లోడ్ చేయడం వల్ల మళ్లీ మళ్లీ రీఓపెన్ అవుతున్నాయని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని స్వయంగా పర్యవేక్షించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. వ్యవసాయ శాఖ 21, పంచాయతీ రాజ్ 19, పోలీస్ శాఖ 8, స్త్రీ శిశు సంక్షేమం 12, రెవిన్యూ తదితర శాఖల్లో రీఓపెన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సబార్డినేట్ అధికారులకు డెలిగేట్ చేయకుండా జిల్లా అధికారులే సీరియస్ గా తీసుకొని స్వయంగా పరిశీలించాలన్నారు. టాప్ ఫోర్ సర్వీసులు, ఇల్లు పట్టాల మంజూరు, ముటేషన్ టైటిల్ డీడ్స్ తదితర రెవిన్యూ అంశాల్లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో స్పందన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు సంబంధిత ఫోటోగ్రాఫ్స్ స్పందన పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు ఎవ‌రు చేయడం లేదని ఈ విషయంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్పందన దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఎలోకి వెళ్ళకుండా, రీ ఓపెన్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ జాప్యాన్ని నివారించి వేగంగా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోర్టు కేసులకు సంబంధించి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్ సంబందించిన అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు: నంద్యాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామ నివాసితురాలు జీవరత్నమ్మ తనకి ఇంటి స్థలం లేదని ఇంటి స్థలం మంజూరు చేయించాల్సిందిగా కలెక్టర్ వారిని కోరుతూ దరఖాస్తు సమర్పించుకున్నారు. నంద్యాల మండలం పిన్నాపురం గ్రామ నివాసితుడు మిద్దె చిన్న వెంకట సర్వేనెంబర్ 190/2 పైకి 2.04 సెంట్ల భూమి సాగు చేసుకుంటున్నాను. సదరు భూమి అన్యాక్రాంతంగా, దౌర్జన్యంగా ఇతరులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. కావున తమరు దయతో సదరు భూమిని ఆన్లైన్లో నమోదు చేయించగలరని కోరుతూ దరఖాస్తు సమర్పించుకున్నారు. బనగానపల్లె మండలం కైప గ్రామం సర్వేనెంబర్ 107/7 లో 385 ఎకరాల విస్తీర్ణం వుంది. కొద్దిరోజుల క్రితం ఆన్లైన్ లో చూడగా నా పొలంలోని ఒక ఎకరా భూమి తగ్గిందని, వేరే వ్యక్తుల పేరుమీద ఆన్లైన్లో చూపుతోందని తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించుకున్నారు. నంద్యాల మండలం నూనెపల్లి గ్రామ నివాసి గజవల్లి అచ్చయ్య తనకు గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామానికి మజరా గ్రామమైన ఆర్లగడ్డ ప్రాంతంలో సర్వేనెంబర్ 566/2 లో 30 సెంట్ల విస్తీర్ణం గల భూమి వారసత్వంగా సక్రమించిందని సదరు భూమి రెవెన్యూ రికార్డులు వేరే వ్యక్తులపై నమోదు చేసి ఉన్నారు. విచారించి నా భూమిని నాకు ఇప్పించవలసిందిగా కోరుతూ దరఖాస్తు కలెక్టర్ కు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో 206 మంది అర్జీదారులు తమ సమస్యలపై వినతి పత్రాలు కలెక్టర్ కు సమర్పించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.