ఐఎంఏ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక హోటల్ సమావేశ మందిరంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవి కృష్ణ ,మాజీ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ త్యాగరాజ రెడ్డి మాజీ రాష్ట్ర సెక్రెటరీ సాయి ప్రసాద్ ముఖ్యఅతిధులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. డాక్టర్ బి. సి.రాయ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐఎంఏ వైద్యుల దినోత్సవ పురస్కారాలను డాక్టర్ త్యాగరాజ రెడ్డి ,డాక్టర్ సాయిప్రసాద్ డాక్టర్ నటరాజ్, డాక్టర్ మాధవి, డాక్టర్ షబ్నం, డాక్టర్ లక్ష్మీప్రసన్న, అనస్తీసియా వైద్యులు డాక్టర్ మాధవి లకు అందజేసి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ఈమె అధ్యక్షులుగా ఎన్నుకోబడిన డాక్టర్ రవి కృష్ణ దంపతులను కూడా ఈ సందర్భంగా నంద్యాల వైద్యుల సంఘం అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.ఈ.పి.వి. రాజశేఖర్ రచించి రూపొందించిన ఐఎంఏ గీతాన్ని ఆవిష్కరించారు. ఐఎంఏ గీతాన్ని రూపొందించిన డాక్టర్ రాజశేఖర్ ను సత్కరించారు. ఈ సమావేశంలో నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్, మహిళా విభాగ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నర్మదా, డాక్టర్ వసుధ, మిషన్ పింక్ హెల్త్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నాగమణి, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, మెడికల్ స్పెషాలిటీస్ అకాడమీ కార్యదర్శి డాక్టర్ హరిత గత సంవత్సర కార్యక్రమాల నివేదికలు సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఐఎంఏ దేశంలో 1928లో ప్రారంభించబడిందని ఇప్పుడు 35 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో 1750 బ్రాంచీలలో మూడు లక్షల 35 వేల మంది సభ్యులతో ప్రపంచంలో అతిపెద్ద వృత్తి స్వచ్ఛంద సంస్థ ఐఎంఏ అని అన్నారు.దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి, వైద్యుల నిరంతర వైద్య విద్యని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 బ్రాంచ్ లలో ఇరవై వేల మంది అటు ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో ఐఎంఏ సభ్యులు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని, వీరి సమస్యల పరిష్కారం కోసం ఐఎంఏ నిరంతరం పని చేస్తుందని అన్నారు. డాక్టర్ త్యాగరాజు రెడ్డి డాక్టర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఐఎంఏ వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సమయంలో కూడా పెట్టి వైద్యం అందించారని గుర్తు చేశారు. వైద్యులపై ఆసుపత్రులపై దాడులకు పాల్పడడం సరైన విధానం కాదన్నారు. వైద్యుల రక్షణ చట్టాన్ని రాష్ట్రంలో మరింత కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందని అదేవిధంగా జాతీయస్థాయిలో కూడా వైద్య రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. డాక్టర్ సహదేవుడు డాక్టర్ బి సి రాయి జీవిత విశేషాలు వివరించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులకు, వైద్యుల కుటుంబ సభ్యులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, నంద్యాల శాఖ కోశాధికారి డాక్టర్ పనిల్, అధిక సంఖ్యలో వైద్యులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.

ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యుల దినోత్సవం
- Post published:July 4, 2022
- Post category:Nandyal