You are currently viewing స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ నిరతిని మరువరాదు

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ నిరతిని మరువరాదు

  • Post category:Nandyal

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి ఘన నివాళులు

-జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగనిరతిని మరువరాదని, వారిని తప్పక మననం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని (ఆర్ఎఆర్ఎస్‌) వైఎస్సార్ సెంటినరీ హాలులో స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం వీరుడు, ఉద్యమకారుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య, ఇతర జిల్లాధికారులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్మాట్లాడుతూ భారతస్వాతంత్ర్యచరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నత శక్తి అన్నారు. ఇతను జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేకతను సంతరించికుందన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడని తెలిపారు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొని వీర మరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు.