You are currently viewing స్వాతంత్ర్య ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు పోరాటం కీర్తించదగినది -జిల్లా ఎస్పీ

స్వాతంత్ర్య ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు పోరాటం కీర్తించదగినది -జిల్లా ఎస్పీ

  • Post category:Nandyal

స్వాతంత్ర్య ఉద్యమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం కీర్తించదగినదని జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్దగల పోలీస్ కార్యాలయంలో సోమవారం అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి అదే బాటలో ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడని ,బ్రిటిష్ వారి గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి పోరాటపటిమను కొనియాడారు. బ్రిటిష్ వారి నిరంకుశ చర్యలు వలన మన్యం ప్రజలు ఎదుర్కొంటున్న దీనస్థితిగతులను పరిశీలించి ప్రజలను చైతన్యపరిచి విప్లవానికి నాంది పలికాడదని, బ్రిటిష్ పాలకుల దోపిడీ, దురాగతాలు, దమనకాండల నుండి విముక్తి కొరకు సీతారామరాజు గారు సాగించిన సాయుధ పోరాటం తెలుగు జాతి చరిత్రలో గొప్ప ఘట్టంగా చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని, అల్లూరిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఇన్‌ఛార్జ్‌ డిఎస్సీ సి.మహేశ్వర్ రెడ్డి, ఎఆర్‌ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ , స్ఐ సోమశేఖర్, సిబ్బంది, డిపిఓ ఎఎఓ దేవి, డిపిఓ సూపరింటెండెంట్ ఖాదర్ వలీ, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.