You are currently viewing స్పందన అర్జీలను చట్ట పరిదిలో సత్వరమే పరిష్కరించండి -ఎస్పీ రఘువీర్ రెడ్డి

స్పందన అర్జీలను చట్ట పరిదిలో సత్వరమే పరిష్కరించండి -ఎస్పీ రఘువీర్ రెడ్డి

  • Post category:Nandyal

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 95 ఫిర్యాదులను నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి గారు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఫిర్యాదిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి చట్ట పరిధిలో సమస్యలను సవరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆరోగ్యం బాగాలేక తనకున్న ఇల్లు అమ్మి వైద్యం చేసుకోవాలి అనుకుంటుండగా తన కోడలు అమ్మనివ్వకుండా అడ్డుపడి హింసిస్తుందని దొర్నిపాడుకు చెందిన సరోజమ్మ ఫిర్యాదు చేశారు. గవర్నమెంట్ వారు 40 సంవత్సరాల క్రితం 03 సెంట్లు స్థలం ఇవ్వగా అందులో ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నామని ఫిర్యాది అవ్వ చనిపోగా భూస్థాపితం కొరకు వేరే ఊరికి వెళ్ళగా తనకిచ్చిన ఇంటిని భూకబ్జాదారులు, వడ్డీ వ్యాపారస్తులు తమ ఇంటిని నేలమట్టం చేసినారని ఇంట్లోనే సామాన్లు తీసుకొని వెళ్ళినారని తనకు న్యాయం చేయాలని దేవనగర్ కు చెందిన టి.మరియమ్మ ఫిర్యాదు చేశారు. అన్న భార్య మరియు ఫిర్యాది భార్య గొడవ పడుచుండగా ఇద్దరినీ విడిపించుటకు ఫిర్యాది అడ్డుపోగా తన అన్న ఫిర్యాదిని కొట్టగా ఫిర్యాది యొక్క లివర్ నందు బ్లడ్ చేరి కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆపరేషన్ చేయించుకుని ఇంటికి రాగా తన అన్న ఫిర్యాది పైనే కేసు పెట్టారని తనకు న్యాయం చేయాలని పోన్నాపురానికి చెందిన సుదర్శన్ ఫిర్యాదు చేశారు. తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని రాజోలి గ్రామం చాగలమర్రి మండలం నందు గల రిజర్వాయర్ కు పోయిందని కానీ తన పేరు కాకుండా మరొకరి పేరు లిస్టు లో చేర్చి మోసం చేసినారని తనకు న్యాయం చేయాలని నెమల్లదీన్నే గ్రామం పెద్దముడియం మండలం కడప జిల్లాకు చెందిన నడిపి పాములేటి ఫిర్యాదు చేశారు. ఓంకారం దేవస్థానం వారు స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదిదారులకు భోజన వసతులు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.