You are currently viewing రుణాల‌తో మ‌హిళ‌లు అభివృద్ధి ప‌థానా నడ‌వాలి -ఎమ్మెల్యే శిల్పా ర‌వి

రుణాల‌తో మ‌హిళ‌లు అభివృద్ధి ప‌థానా నడ‌వాలి -ఎమ్మెల్యే శిల్పా ర‌వి

  • Post category:Nandyal

శిల్పా మ‌హిళ సంఘం ఆధ్వ‌ర్యంలో తీసుకున్న రుణాల‌తో మ‌హిళ‌లు స‌ద్వినియోగం చేసుకొని అభివృద్ధి ప‌థానా న‌డ‌వాల‌ని ఎమ్మెల్యే శిల్పా ర‌విచంద్ర‌కిశోర్ రెడ్డి పిలుపునిచ్చారు. శ‌నివారం శిల్పా మహిళా సంఘం ఆధ్వర్యంలో 21.16లక్షల రుణాలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శిల్పా మహిళా సంఘం పార్టీలకు కులమతాలకతీతంగా రుణాలను పంపిణీ చేయడం జరుగుతుంద‌న్నారు. ముఖ్యంగా శ‌నివారం 177 మంది మహిళలకు 21.16 లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేయడం జరిగిందని మహిళలు దినదినాభివృద్ధి చెందుతూ వారు వ్యాపారాలను మెరుగు పరుచుకుంటూ కొత్త కొత్త ఆలోచనలతో రుణాలను సద్వినియోగం చేసుకొవ‌డం జరుగుతుందన్నారు. మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి మహిళలకు అవకాశం కల్పిస్తామ‌ని తెలియజేశారు. అలాగే కొందరు తెలుగుదేశం నాయకులు పేద ప్రజలకు చేస్తున్న సేవ కార్యక్రమం కూడా కడుపు మంటతో ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మీరు కూడా సేవా కార్యక్రమాల్లో పోటీ పడి ప్రజలకు సేవ చేయాలని లేదంటే ఇటువంటి ప్రచారాలు మానుకోవలన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నంద్యాల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించే ఘ‌న‌త‌ ఒక శిల్పా కుటుంబానికి దక్కుతుందని ఎంతమంది ఎన్ని ప్రచారాలు చేసినా పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలు ఆపేది లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సంఘం మేనేజర్ హరిలీల, వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, గోపవ‌రం జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, సేవసమితి మేనేజర్ లక్ష్మీ నారాయణ, సహదేవుడు మహిళా సంఘం, మహిళలు పాల్గొన్నారు.