You are currently viewing బస్ చార్జీలు పెంపుకు నిరసనగా ఆళ్లగడ్డలో టిడిపి ధర్నా

బస్ చార్జీలు పెంపుకు నిరసనగా ఆళ్లగడ్డలో టిడిపి ధర్నా

  • Post category:Nandyal

సామాన్య ప్రజలను దోచుకుంటున్న జగన్ రెడ్డి
టిడిపి యువ నాయకుడు జగత్ విక్యాత్ రెడ్డి

బస్ ఛార్జీలు పెంపు నిరసనగా ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భూమాజగత్ విఖ్యాత రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు శనివారం ఆళ్లగడ్డ లో ఆర్ టి సి బస్ స్టేషన్ల వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి నినాదాలు చేస్తూ ఆర్టీసీ బస్సులో ఛార్జీల పెంపు ను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టిసి చార్జీల పెంపుతో సామాన్య ప్రజలను దోచుకుంటున్న జగన్ రెడ్డి కి ప్రజలు బుద్ది చెపుతారు అని అన్నారు. జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదు అన్నారు. రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై పెను భారం మోపడమే అని భూమా విక్యాత్ రెడ్డి అన్నారు. పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారని. రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ.500 కోట్లు పేదల నుండి వైసిపి ప్రభుత్వం కొట్టేస్తుందని ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేయడం దారుణం అని అన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఆర్టీసీ రూపురేఖలు మారుస్తానన్న జగన్ మోసపు రెడ్డి ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నార ని విమర్శించారు. ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారని ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకులు భూమా విక్యాత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కాల పరిమితి లోనే రెండోసారి డీజిల్ సేస్ పేరుతో ప్రజల పై 500 కోట్ల రూపాయల భారం మోపుతో ఆర్టీసీ బస్ చార్జీలు పెంచడాన్ని వారు ఖండించారు పెంచిన బస్ చార్జీల నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వం లో పెంచడం తప్ప ప్రజలకు పంచేది. ఏమి ఉందంటూ ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అన్నం చంద్రశేఖర్ రెడ్డి . తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి.మాజీ జెడ్పిటిసి చాంద్ భాషా. తెలుగు యువత తాలూకా నాయకులు నన్నే బై గారి జిలాని. బంగారు రాము యాదవ్. రామ శేఖర్ రెడ్డి. భూపతి రాజు. తదితరులు పాల్గొన్నారు.