అర్హులందరికీ సంక్షేమ పథకాలు
-ఎమ్మెల్యే గంగుల బిజెంద్ర
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ సంక్షేమపథకాలు అందిస్తున్నారని శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శాసనసభ్యులు గంగుల మున్సిపాలిటీ పరిధిలోని జీనిగిరి రామయ్య వీధి, ఎస్.వి.నగర్, హరిజన పేట, విశ్వరూప కాలనీలలో నంద్యాల విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్ మోహన్ రెడ్డితో కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు వాటి ప్రయోజనాలను కరపత్రాల రూపంలో ఇచ్చి వివరించడం జరిగింది.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం గురించి ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఆయా కాలనీ వాసులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు . వారి సమస్యలను విని వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ రమేష్ బాబు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కూలూరు నరసింహారెడ్డి, కౌన్సిలర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి, వైకాపా పట్టణ ఇంచార్జి సింగం భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.