You are currently viewing ప్రభుత్వ పథకాలే మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయి -ఎమ్మెల్యే శిల్పా రవి

ప్రభుత్వ పథకాలే మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయి -ఎమ్మెల్యే శిల్పా రవి

  • Post category:Nandyal

ప‌ట్ట‌ణంలోని 14వార్డు సుద్దల పేటలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం 2వ రోజు వార్డ్ కౌన్సిలర్ విమలమ్మ ఆధ్వర్యంలో నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుంటూ ప్రతి గడప ను తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 14వ వార్డు సుద్దాల పేటలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఇంటికి అందుతున్నాయో లేదో తెలుసుకోవడానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఇంకా ఎవరైనా ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులు ఉంటే వారికి అందించే విధంగా కృషి చేస్తామన్నారు అలాగే ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అందుతున్నాయి లేదో తెలుసుకోవడం కోసమేనని ప్రభుత్వ పథకాలు ద్వారా ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ,మున్సిపల్ చర్మన్ మా భున్నిసా, వార్డు కౌన్సిలర్ విమలమ్మ వైఎస్ఆర్సిపి నాయకులు సోమశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మౌలాలి, మాజీ కౌన్సిలర్ బండి శాంతకుమారి,మజీద్ , ఫాతిమా,శంకర్ గౌడ్, రామ సుబ్బయ్య, చిప్పగిరి ప్రసాద్, వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్ వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు, మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది వార్డు వాలంటరీలు పాల్గొన్నారు.