You are currently viewing సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న -శిల్పా రవి

సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న -శిల్పా రవి

  • Post category:Nandyal

నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్సిపికార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు నేడు నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో కేక్ కట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది సచివాలయ సిబ్బందిని నంద్యాల శాసన సభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి శుభాకాంక్షలుతెలియజేశారు. ఈ సందర్భంగా గా నంద్యాల శాసన సభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం ద్వారా ఎంతోమంది నిరుద్యోగులను గుర్తించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకతీతంగా సచివాలయాలలో ఉద్యోగులను ఏర్పాటుచేసి ప్రజలకు అన్ని విధాల ప్రభుత్వ పథకాలను అందించడంలో ముఖ్యపాత్ర పోషించడం జరిగిందని అలాగే సచివాలయం ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరు జగన్ అన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నకు మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని కోరారు.