లయన్స్ జిల్లా 316 జే లో కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఉన్న 10 లయన్స్ క్లబ్ లకు ప్రాంతీయ చైర్మన్ గా నంద్యాలకు చెందిన కశెట్టి చంద్రశేఖర్ ను లయన్స్ జిల్లా గవర్నర్ చంద్ర ప్రకాష్ నియమించారు.కశెట్టి చంద్రశేఖర్ గతంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు గా, జోనల్ చైర్మన్ గా నంద్యాల ప్రాంతంలో అందించిన విశిష్ట సేవలను గుర్తించి లయన్స్ గవర్నర్ చంద్రశేఖర్ కు ఈ ప్రాంతీయ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. కశెట్టి చంద్రశేఖర్ ప్రాంతీయ చైర్మన్ గా నియమించిన సందర్భంగా ఐ ఎమ్ ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ, మాజీ ఆంధ్రప్రదేశ్ లయన్స్ చైర్మన్ ఏ.వి.ఆర్. ప్రసాద్, సీనియర్ సభ్యులు డాక్టర్ సహదేవుడు, శ్రీకాంత్, రవి ప్రకాష్ ,కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్, కూరా ప్రసాద్, కోశాధికారి రత్న తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా కశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ కర్నూలు నంద్యాల జిల్లాలలో ఉన్న పది లయన్స్ క్లబ్ సంస్థల ద్వారా ఈ సంవత్సరం సేవా కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహించడానికి కృషి చేస్తామని తెలిపారు.

లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ గా కశెట్టి చంద్రశేఖర్
- Post published:June 30, 2022
- Post category:Nandyal