ఉమ్మడి కర్నూలు జిల్లా బ్యాట్మెంటన్ ఎంపిక

  • Post category:Nandyal

జూలై 2, 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ కార్యదర్శి వంశీధర్ తెలిపారు. జూలై 2 వ తేదీన నంది పైప్స్ బ్యాట్మెంటన్ అకాడమీ నందు అండర్ 17, 19 బాల బాలికలు విభాగం బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు, జూలై 3వ తేదీన ఎస్.ఆర్.ఏ బ్యాడ్మింటన్ అకాడమీ కర్నూలు నందు పురుషులు స్త్రీల విభాగం నిర్వహిస్తున్నట్లు, జులై 9నుండి 10 వరకు అండర్ 11,13 అండర్15 బాల బాలికలు విభాగం బ్యాడ్మింటన్ పోటీలు నంద్యాలలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలలో గెలిచిన క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్తాయి పోటీలకు కర్నూలు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. ఎంట్రీ ఆఖరి తేది జూలై 1 2022 లోపు పంపవలెనని తెలిపారు. ఇతర సమాచారం కొరకు 8985809434, నంబర్‌ను సంప్రదించవలసినదిగా కోరారు.