You are currently viewing జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయండి

జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయండి

  • Post category:Nandyal

ఈనెల 30వ తేదీన గురువారం జిల్లా కేంద్రమైన నంద్యాలలో నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైసిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, ఆ పార్టీ మండల కన్వీనర్ కుమార్ రెడ్డిలు పిలుపునిచ్చారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చాగలమరి మండలం నుండి వైసిపి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. ఆళ్లగడ్డ లో జరిగిన ప్లీనరీ సమావేశాన్ని ఏ విధంగా అదేవిధంగా జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో జడ్పిటిసి లక్ష్మీదేవి, గొడుగునూరు ఎంపిటిసి పత్తి నారాయణ, జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శి గణేష్ రెడ్డి , అబ్దుల్లా, బబ్లు, జాఫర్ వలి,మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.