You are currently viewing సిరివెళ్ల రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు

సిరివెళ్ల రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు

  • Post category:Nandyal

రాష్ట్రంలో ఆత్మహత్యచేసుకున్న కౌలురైతు కుటుంబాలను జనసేన రచ్చబండ కార్యక్రమం ద్వారా ఒక్కొక్క రైతు కుటుంబానికి రూ ఒక లక్ష జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడో విడతగా నంద్యాల జిల్లా సిరివల్ల మండలంలో ఆదివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన 130 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ ఒక లక్ష రూపంలో పవన్కళ్యాణ్ అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం, నందికొట్కూరు ,ఆళ్లగడ్డ, నంద్యాల మండలం గ్రామాల రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. మరో విడత లో మిగిలిన రైతు కుటుంబాలకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని జనసేన నాయకులు కర్నూల్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ ,ఆళ్లగడ్డ ఇంచార్జి మ ల్లయ్య తెలిపారు. సిరివెళ్ల రచ్చబండ కార్యక్రమానికి విచ్చేస్తున్న సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 11:18 ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. 12 గంటలకు వెంకటేశ్వరపురం, బొమ్మల సత్రం, ఐలూరు గ్రామాలలో రైతులకు చెక్కులు అందజేసిన పరామర్శిస్తారు. గోవింద పల్లె వద్ద భోజనం చేసుకొని సాయంత్రం నాలుగు గంటలకు సిరివెళ్ల రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు