You are currently viewing బిసిల అభివృద్ది టిడిపితోనే సాధ్యం – బిసి నాయ‌కుల

బిసిల అభివృద్ది టిడిపితోనే సాధ్యం – బిసి నాయ‌కుల

  • Post category:Nandyal

ప‌ట్ట‌ణంలోని మున్సిపల్ ఆఫీసు సమీపంలో గల సూరజ్ గ్రాండ్ హోటల్ నందు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరి భూషన్న ఆధ్వ‌ర్యంలో మంగళవారం ఉదయం ముఖ్య‌నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసిల అభివృద్ది టిడిపితోనే సాధ్య‌మని వైసిపికి ఓటు వేసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎందుకెశామని బాధ‌పడుతున్నరని రాష్ట్రం నలభై సంవత్సరాలు అభివృద్ది వెనక్కు వెల్లిందని ఇప్పటికైన మనందరం ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకునేందుకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర‌ కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు మాట్లాడుతూ ఈ రాష్ట్ర అభివృద్దికి సమర్దవంతమైన న్యాయకత్వంతో పాటు విద్యార్దులు, యువత, రైతులు, ఉద్యోగులు అందరు ఆనందంగా ఉండాలంటే అది చంద్రబాబుకే సాధ్య‌మ‌ని తెలిపారు. అనంతరం టిడిపి రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ వార్డు, గ్రామ, మండల కమిటీలు వేసి సమావేశాలు ఏర్పాటు చేయాలని బిసిలు లేనిది తెలుగుదేశం పార్టీ లేదని యన్ టి ఆర్ వల్లే మేము కద్దరు చొక్కలు వేసుకొని తిరుగుతున్నమని అది ఆయన పేట్టిన బిక్షనేనని స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల వల్లనే తాము రాజకీయంగా ఎదిగామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరి భూషన్న మాట్లాడుతూ అన్ని గ్రామ మండల కమిటీలు బిసి కులాలలోని అన్ని ఉపకులాలను కలిపి టిడిపి బిసి సెల్ కమిటీలు నియోజకవర్గ ఇన్‌ఛార్జీల సహకారంతో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంగంపేట ఏంపిటిసి శ్రీనివాసులు, బెస్త సాధికార కమిటీ నాయకులు వెంకటరమణయ్య, టిడిపి బిసి సేల్ కార్యదర్శి బాలు నాయుడు, ఆర్గనైజింగ్ సేక్రటరి చిలకలచిన్నయ్య, సేక్రటరి పుల్లారెడ్డి యాదవ్ అల్లా బకాష్, మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర‌ కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్, వరాలయ్య, సిద్దయ్య, బాలు, టిడిపి బిసి సేల్ నాయకులు పాల్గొన్నారు.