You are currently viewing స్పందన అర్జీలను చట్ట పరిధిలో సత్వరమే పరిష్కరించండి – జిల్లా ఎస్పీ

స్పందన అర్జీలను చట్ట పరిధిలో సత్వరమే పరిష్కరించండి – జిల్లా ఎస్పీ

  • Post category:Nandyal

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 109 ఫిర్యాదులను నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఫిర్యాధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి చట్ట పరిధిలో సవరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి ఎక్కువగా కుమారులు తమ తల్లిదండ్రుల వద్ద నుండి ఆస్తిని తీసుకొని తమ తల్లిదండ్రులను ఆలనా పాలన చూడకుండా వదిలేస్తున్నారని అది మంచి పద్ధతి కాదని ఎస్పీ తెలియజేస్తూ అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వినని పక్షంలో చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముగ్గురు కుమారులు తన ఆస్థిని తీసుకుని ఇబ్బంది పెడుతున్నారని మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన వారి తండ్రి సూర్య నాయక్ ఫిర్యాదు చేశారు. నంద్యాలలోని వై ఎస్ ఆర్ నగర్ లో తక్కువ ధరకు ఫ్లాట్ ఇప్పిస్తామని కొణిదెడు గ్రామానికి చెందిన ముద్దవరం మద్దిలేటి నమ్మించి డూప్లికేట్ పట్టా ఇచ్చి మోసం చేసినాడని నంద్యాల టౌన్ సరస్వతి నగర్ కు చెందిన బి. మానస, ఎమ్‌.చిన్నమ్మలు ఫిర్యాదు చేశారు. 2-5 -2022లో కోర్టు జడ్జిమెంట్ ద్వారా ఐదు సెంట్ల స్థలం పొందగా అది చెల్లదని ఆ స్థలం జోలికొస్తే అంతు చూస్తామని రత్నమయ్య, శ్రీ‌ను అనువారు బెదిరిస్తున్నారని నందికొట్కూరు టౌన్ కు చెందిన ఎస్‌. వలి ఫిర్యాదు చేశారు. హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ గా జాబ్ ఇప్పిస్తానని బేతంచెర్ల మండలానికి చెందిన గుండాల ప్రసాద్ బాబు మోసం చేసినాడని నంద్యాల పట్టణానికి చెందిన నాగేంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. ఓంకారం దేవస్థానం వారు స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాధిదారులకు భోజన వసతులు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆర్‌. రమణ, డిఎస్‌పి రామాంజినాయక్ పాల్గొన్నారు.