-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్న సమున్నత ఆశయంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని ఈ పథకం కింద జిల్లాలోని 1,72,112 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.258.16 కోట్లు జమ చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మునిసిపల్ టౌన్ హాల్ లో జగనన్న అమ్మ ఒడి పథకం 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న రాష్ట్రంలోని 70,05,964 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ 43,96,402 తల్లుల ఖాతాల్లో వరుసగా మూడవ విడత ఆర్థిక సాయం రూ.6,595 కోట్ల రూపాయలను శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి సోమవారం ఉదయం బటన్ నొక్కి నగదు మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేసే మహత్తర కార్యక్రమాన్ని లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్, మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్ తమీమ్ సమద్, హస్తకళల స్టేట్ డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఉర్దూ అకాడమీ స్టేట్ డైరెక్టర్ అబ్దుల్ సుకుర్, డిప్యూటీ డిఇఓ అనురాధ, ఎంఈఓ బ్రహ్మం, జి సిడిఓ లలితా కుమారి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా కలిసిన మీడియా విలేఖరులతో జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ జగనన్న అమ్మ ఒడి పథకం కింద వరుసగా మూడో ఏడాది జిల్లాలోని 1,72,112 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.258.16 కోట్లు జమ చేశామన్నారు. పిల్లల చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్న ప్రధాన ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. అలాగే నాడు నేడు కార్యక్రమం కింద ప్రతి పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరుస్తునట్లు కలెక్టర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూడో విడత జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా నగదు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఈ సందర్భంగా నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు విద్యపై దృష్టి సారించలేదని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఏటా జగనన్న అమ్మ ఒడి పథకం కింద నగదు మొత్తాన్ని తల్లులలో ఖాతాల్లోకి జమ చేస్తోందన్నారు. విద్యతోనే మన తల రాతలు మారతాయన్న ధృడ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. నంద్యాల పట్టణంలోని దాదాపు 27 వేల మంది తల్లుల ఖాతాల్లోకి 40 కోట్ల రూపాయల నగదు జమ అయిందని ఆయన తెలిపారు. అవినీతికి తావు లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాడు నేడు కార్యక్రమం కింద అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువే కీలకమని జగనన్న అమ్మ ఒడి పథకంతో పిల్లల భవిష్యత్, వారి కుటుంబాలలో మార్పులు వస్తాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాదయాత్రలో డ్రాపవుట్స్ ఉన్న విద్యార్థులు చదువుకోకుండా వీధుల్లో తిరుగుతున్న దృశ్యాన్ని గమనించి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాల ద్వారా విద్యా రంగానికి పెద్ద పీట వేసి అమలు పరుస్తున్నారన్నారు.