నంద్యాల లయన్స్ క్లబ్ 2022- 23 వ సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం స్థానిక బాలాజీ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షులుగా చందా చంద్రమోహన్,కార్యదర్శిగా కూరా మురళి కృష్ణ ప్రసాద్, కోశాధికారిగా రత్న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
విజయవాడ కు చెందిన లయన్స్ క్లబ్ అంతర్జాతీయ ఫౌండేషన్ ప్రాంతీయ ఛైర్మన్ పర్వతనేని సుభాష్ బాబు కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా లయన్స్ క్లబ్ లో చేరిన 16మంది సభ్యులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లయన్స్ మాజీ చైర్మన్ ముల్పురు ఉపేంద్ర ప్రమాణ స్వీకారం చేయించగా, లయన్స్ క్లబ్ రాష్ట్ర మాజీ చైర్మన్ ఎ.వి.అర్. ప్రసాద్ కీలక ఉపన్యాసం ఇచ్చారు.పర్వతనేని సుభాష్ బాబు మాట్లాడుతూ 210 దేశాలలో 14 లక్షల మంది లయన్స్ సభ్యులతో అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సేవా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. పేద గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య రక్షణ విద్యా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రధాన ధ్యేయంగా లయన్స్ క్లబ్ సంస్థ పని చేస్తుందని తెలిపారు.నంద్యాల లయన్స్ క్లబ్ సేవలను ప్రశంసించారు. రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామక్రిష్ణ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుసూదన్ రావు, బాలాజీ కళ్యాణ మంటపం ఛైర్మన్ కశెట్టీ కృష్ణ మూర్తి, ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని ప్రసంగించారు. లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు,రాష్ట్ర ఐ.ఎమ్.ఎ.అధ్యక్షులు డాక్టర్. రవి కృష్ణ,డాక్టర్ గేలివి సహదేవుడు మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ ఏర్పడి 51 సంవత్సరాలు అవుతున్నదనీ, భవిష్యత్తులో కూడా ప్రజలకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. సేవ చేయడం భారతీయ సంస్కృతిలో భాగమని, “సర్వేజనా సుఖినోభవంతు” అని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, “వసుదైక కుటుంబం “అంటే మానవులందరూ సమానులు, “పరోపకారార్ధం ఇదం శరీరం” అని ఇతరులకు సేవ చేయడం కోసమే మానవ జన్మ అని చాటిచెప్పిన భారతీయ సంస్కృతి అందించిన సేవా స్ఫూర్తితో తో సేవా కార్యక్రమాలు నంద్యాల లయన్స్ క్లబ్ విస్తృతం చేస్తుందని తెలిపారు. ఉపాధ్యక్షులుగా ఉపేంద్ర, షావలి రెడ్డి, బింగు మల్ల శ్యామ్సుందర్ గుప్తా, సంయుక్త కార్యదర్శులుగా ఇమ్మడి రామకృష్ణ సుధాకర్, మరియు వివిధ పదవులకు, వివిధ కార్యక్రమాల సబ్ కమిటీ చైర్మన్ లుగా పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడు చంద్ర మోహన్,కార్యదర్శి కూరా ప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే రీతిలో వివిధ సేవా కార్యక్రమాలను ఈ సంవత్సరం చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని, నంద్యాల లయన్స్ క్లబ్ స్వర్ణోత్సవ సేవా కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తామని, నంద్యాల లయన్స్ క్లబ్ పేరు ఇనుమడింప చేస్తామన్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరం అధ్యక్షులు గా సేవలు అందించిన రవీంద్రనాథ్, ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ మనోహర్ రెడ్డి, నంద్యాల లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు ఆత్మకూరు సుదర్శనం, ఆంజనేయులు గుప్తా ,బవిరి శెట్టి శ్రీకాంత్, రవి ప్రకాష్, కశెట్టి చంద్రశేఖర్ అధిక సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు కుటుంబాల తో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థి కి, అనారోగ్యం తో ఉన్న పేద బాలికకు, బధిర వ్యక్తికి వినికిడి యంత్రాన్ని అందించారు.
