You are currently viewing కన్నకొడుకే తండ్రిని కడతేర్చాడు

కన్నకొడుకే తండ్రిని కడతేర్చాడు

  • Post category:Nandyal

కన్నకొడుకే తండ్రిని అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి చంపిన సంఘటన ఆళ్లగడ్డ మండల పరిధిలోని పెద్ద కందుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి డి.ఎస్.పి వెంకటరామయ్య తెలిపిన వివరాల మేరకు కోట కందుకూరు గ్రామానికి చెందిన అంబారపు నారాయణ (56) అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా ఆయన కుమారుడైన పవన్ కుమార్ తన తండ్రి అయిన నారాయణను శనివారం తెల్లవారుజామున అత్యంత పాశవికంగా గొడ్డలితో నరకడoతో అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్ కుమార్ పాలిష్ కటింగ్ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి నారాయణ దుర్వ్యసనాలకు లోను కావడంతో తండ్రి, కొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆళ్లగడ్డ సిఐ రాజశేఖ‌ర్ రెడ్డి ఎస్సై నర్సింహులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పవన్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు ఒక టీంను ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు.