రైతులు ఆర్‌బికేలో పేర్లను నమోదు చేసుకోవాలి

  • Post category:Nandyal

రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న, పసుపు ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయుటకు ఆదేశాలు జారీ చేయటము జరిగినది. ఈ-క్రాప్, ఈకెవైసి చేయించుకున్న రైతులు ఆర్‌బికే ( రైతు భరోసా కేంద్రాలలో ) నందు నేటి నుండి అనగా 25.06.2022 తమ పేర్లను నమోదు చేసుకోగలరు. కనుక రైతు సోదరులు తమ సమీప ఆర్‌బికేల ( రైతు భరోసా కేంద్రాలలో ) నందు తమ వివరాలు నమోదు చేయించుకోగలరు. రైతు సోదరులు తమ పంటను ఈ – క్రాప్, ఈకెవైసి చేయించుకొని పంట నిల్వ చేసుకొని ఉన్న రైతులు మాత్రమే కొనుగోలుకు అర్హులు. జొన్న, పసుపు కొనుగోలు జులై 1 నుండి ప్రారంభమగును. హార్టికల్చర్ అధికారుల గ్రామ పరిశీలనలో పసుపు కొనుగోలుకు సంభందించి 16 మండలాల్లో 46 ఆర్‌బికే లలో 871 రైతుల నుండి 4548 టన్నుల పసుపును గుర్తించారు. జొన్న క్వింటాల్ మద్దతు ధర 2738/- , జొన్న రకము : మహేంద్ర మాత్రమే, పసుపు క్వింటాల్ మద్దతు ధర 6850/-.