అకాడమీ పునరుద్ధణలో భాగంగా జాతీయస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సింథటిక్ మాట్స్, ఎల్ఈడి లైట్స్ తో పునరుద్ధరించారు. ఈరోజు అకాడమీలో నంది గ్రూప్స్ అధినేత సుజల పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడతు జులై మొదటి వారంలో బాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పట్టణ విసిస్టులతో అకాడమీ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ అకాడమీ నుండి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను నిష్ఠానిథులైన కోచ్ ల తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, వంశీ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శేషిరెడ్డి, సంజీవరెడ్డి, నంది గ్రూప్ సిబ్బంది పాల్గొన్నారు.

బాడ్మింటన్ అకాడమీ పునరుద్ధణ
- Post published:June 25, 2022
- Post category:Nandyal