You are currently viewing వైద్యుల క్రీడా పోటీలలో టేబుల్ టెన్నిస్ విజేతలు

వైద్యుల క్రీడా పోటీలలో టేబుల్ టెన్నిస్ విజేతలు

  • Post category:Nandyal

నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల వైద్యులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నంద్యాల జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ సోమశేఖర్ రెడ్డి నిర్వహణలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలలో సింగిల్స్ విభాగంలో డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ సోమ శేఖర్ రెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్ ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. డబుల్స్ విభాగంలో వినోద్ కుమార్, శరత్ చంద్ర లు ప్రథమ స్థానం లో నిలువగా, డాక్టర్ సోమశేఖర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ ద్వితీయ స్థానం, డాక్టర్ ఎన్. ఆర్. ఎస్. మూర్తి, డాక్టర్ మురళి తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. రాష్ట్ర ఐ ఎమ్ ఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐ.ఎమ్.ఎ అధ్యక్ష కార్యదర్సులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ చంద్రశేఖర్ విజేతలను అభినందించారు.