You are currently viewing ప్రయారిటీ భవనాలు త్వరితగతిన పూర్తి చేయండి

ప్రయారిటీ భవనాలు త్వరితగతిన పూర్తి చేయండి

  • Post category:Nandyal

బిలో బేస్మెంట్ స్థాయిలో వున్న భవనాలను వెంటనే ప్రారంభించండి

-స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రయారిటీ భవనాల నిర్మాణాల్లో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి రోజురోజుకు ప్రగతిని సమీక్షించాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం విజయవాడలోని తన కార్యాలయం నుండి
ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణ బాబు, గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ కోన శశిధర్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రయారిటీ బిల్డింగుల నిర్మాణాల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇంకా ప్రారంభం కాని గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ యూనిట్ కేంద్ర భవనాలను బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. సిమెంట్, ఇసుక, స్టీల్ తదితర మెటీరియల్ సమకూర్చుకొని భవనాల నిర్మాణాల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. పూర్తయిన బిల్డింగ్ లకు సంబంధించిన బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలని వారు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రయారిటీ బిల్డింగుల నిర్మాణాల్లో జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేసేందుకు పంచాయతీ శాఖ ఇంజనీర్లకు రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించామన్నారు. ఇంకా ప్రారంభం కాని 28 గ్రామ సచివాలయ భవనాలు, 106 రైతు భరోసా కేంద్రాలు, 78 వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. భవన నిర్మాణాల ప్రగతిలో పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లతో పాటు ఎంపీడీవోలు, ఉపాధిహామీ ఏపీడీలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. జిల్లాలో 415 గ్రామ సచివాలయాల భవనాలకు గాను 238 భవనాలు, 394 రైతు భరోసా కేంద్రాలకు గాను 105 ఆర్బికేలు, 274 వైయస్సార్ హెల్త్ క్లినిక్లకు గాను 53 భవనాలు పూర్తయ్యాని కలెక్టర్ నివేదించారు. ఈ వీడియో కాన్ఫెరెన్సులో పంచాయతీ రాజ్ ఈఈ రామమోహన్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.