You are currently viewing గిరిజన మహిళకు న్యాయం చేయండి

గిరిజన మహిళకు న్యాయం చేయండి

  • Post category:Nandyal
  • గిరిజన మహిళపై పోలీసుల దాష్టీకం దుర్మార్గం
  • డీలర్ షిప్ కోసమే కుట్రకు తెర లేపిన అధికార పార్టీ నాయకులు
  • అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోకతే ఉద్యమిస్తాం
  • నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు గ్రామస్థులతో కలిసి ఆందోళన
  • జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఐఏఎస్ గారికి వినతి పత్రం సమర్పించిన గిరిజన సంఘాల నాయకులు గ్రామస్తులు

అధికారం ఉంది కదా అని గిరిజన మహిళపై గడివేముల మండల పోలీసులు, రెవెన్యూ అధికారులు చేసిన దాస్తేకానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన ప్రజా సమాఖ్య వారి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గడివేముల మండలం ఎల్ కే తండా కు చెందిన గిరిజన మహిళ శోభారాణి భాయి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకొని గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా రేషన్ డీలర్ షిప్ ను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న శోభ రాణి భాయి కుటుంబంపై స్థానిక అధికార పార్టీ నాయకులు కుట్రకు తెరలేపారని అన్నారు. రేషన్ డీలర్ షిప్ ను ఎలాగైనా శోభారాణి బాయి నుంచి బలవంతంగా లాక్కునేందుకు ఒక పథకం ప్రకారం పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టించారని అన్నారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి స్థానిక తండా వాసి ఎంపీటీసీ కాలు నాయక్ అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుల ద్వారా పోలీసులపై ఒత్తిడి తెచ్చి, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రేషన్ డీలర్ షిప్ కోసం దురాగతానికి పాల్పడ్డారని విమర్శించారు. చట్టప్రకారం నడుచుకోవాల్సిన పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా శోభారాణి బాయిని టార్గెట్ చేసి అక్రమంగా ఆమెపై కేసు నమోదు చేశారని ధ్వజమెత్తారు. శోభారాణి భాయి నీ వేధింపులకు గురి చేసిన గడివేముల ఎస్ఐ వెంకటసుబ్బయ్య, ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ తేజ నందరెడ్డి, రెవెన్యూ అధికారులు ఆర్ ఐ, వి ఆర్ ల పై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్ కె తండావాసులు, గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బాలు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, విక్రమ్ నాయక్, బాలాజీ నాయక్, సుబ్బా నాయక్, బొజి నాయక్, వెంకటేశ్వర్లు నాయక్, రవి నాయక్, స్వామి నాయక్, రాజు నాయక్, మత్రు నాయక్, బద్రు నాయక్, బాల నాయక్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.