You are currently viewing బిఐఈఏపి విడుదల చేసిన ఫలితాలలో ఆర్జీఎం వారి విజయ ప్రభంజనం

బిఐఈఏపి విడుదల చేసిన ఫలితాలలో ఆర్జీఎం వారి విజయ ప్రభంజనం

  • Post category:Nandyal

మే నెలలో జరిగిన ఇంటర్ పరీక్షలలో ఆర్జీఎం, శాంతి రామ్ విద్యాసంస్థలలో భాగమైన నంద్యాల జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుంధుబిని మోగించారు. సీనియర్ ఎమ్.పి.సి విభాగంలో 984 మార్కులతో టి. శ్రావణ్ కుమార్ నంద్యాల జిల్లా టాపర్ గా నిలిచాడు. అలాగే బైపిసి విభాగంలో జూనియర్ బైపిసి నందు ఎన్‌. శ్రావణి 435 / 440 మార్కులతో స్టేట్ 3వ‌ ర్యాంక్ ను సాధించారు. ఈ విధంగా జిల్లాలోనే అత్యధిక పాస్ పర్సెంట్ 86 శాతంతో జిల్లా టాపర్ గా నంద్యాల జూనియర్ కళాశాల నిలిచింది. ఈ విజయ సాధనలో కృషి చేసిన విధ్యార్థిని విద్యార్థులకు, ఏఓ జహీర్, డీన్ సాయి ప్రభాకర్, ప్రిన్సిపల్ అక్తర్, ఉపాద్యాయులందరిని ఆర్జీఎం, శాంతి రామ్ విద్యా సంస్థల చైర్మన్ డా. శాంతి రాముడు ఎమ్‌.డి.ఎమ్‌ శివరాం, డీన్ డా.అశోక్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా డా.అశోక్ కుమార్ మాట్లాడుతూ గడచిన 35 సంలుగా నంద్యాల జూనియర్ కళాశాల ఎన్నో విజయాలను సొంతం చేసుకుందన్నారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇంజనీర్లుగా, డాక్టర్ లుగా, ఉన్నత స్థాయిలో ఎదిగి దేశ విదేశాల్లో స్థిర పడటం గర్వకారణమని అన్నారు.