శాంతి రాం ఫార్మసీ కళాశాలలో మంగళవారం ప్రపంచ యోగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ద కళాశాల విద్యార్థులు చేత యోగా మాస్టర్ ఎం నాగేశ్వరరావు ఆసనాలు వేయించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. సి.మధుసూదన్ శెట్టి మాట్లాడుతూ యోగాసనాలతో ఆరోగ్యం ఆనందమయ జీవితాన్ని పొందవచ్చని అన్నారు. ప్రతి రోజు విద్యార్థులు మరియు అధ్యాపకులు యోగాను దినచర్యగా చేయడం వల్ల శారీరిక మానసిక వత్తిడులను దూరం చేసుకొని చదువు పై ఏకాగ్రత సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ ఎస్ ఆర్గనైజర్ కె సంపత్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

శాంతి రాం ఫార్మసీ లో ప్రపంచ యోగా దినోత్సవం
- Post published:June 21, 2022
- Post category:Nandyal