వైకాపా ప్రభుత్వ హయాంలోనే రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని శాసనమండలి ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రాయితీపై అందజేసిన ట్రాక్టర్లను పంపిణీ చేశారు వైయస్సార్ యంత్ర సేవ పథకం ద్వారా ఆళ్లగడ్డ మార్కెట్ యాడ్ నందు రాయితీపై ప్రభుత్వం అందించిన ట్రాక్టర్లను రైతులకు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల రూపాయల విలువ గల సబ్సిడీ ట్రాక్టర్లను రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం జెండా ఊపి ఎమ్మెల్సీ గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం రాయితీల పై ట్రాక్టర్లను రైతులకు అందించడం జరిగిందన్నారు. అలాగే రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 36 రైతు గ్రూపులకు 22 ట్రాక్టర్స్ మరియు వ్యవసాయ సామాగ్రిని ఇవ్వడం జరిగిందన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుల అభివృద్ధికి ఎంతో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3500 పైచిలుకు ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు వ్యవసాయ ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏ డి ఏ చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి కిషోర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
