You are currently viewing సీనియర్ పాత్రికేయులు పి.శేఖర్ మృతి సమాజానికి తీరని లోటు

సీనియర్ పాత్రికేయులు పి.శేఖర్ మృతి సమాజానికి తీరని లోటు

  • Post category:Nandyal

సీనియర్ జర్నలిస్టు పి చంద్రశేఖర్ అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం పంచాంగ్నుల చంద్రశేఖర్ సంతాప సభ ను నిశాంత్ భవనంలో కే చంద్ర అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముందుగా శేఖర్ చిత్రపటానికి పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. అనంతరం వై ఎస్ ఆర్ సి పి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు కే రామసుబ్బయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్, వార్డ్ కౌన్సిలర్ శ్యామ్ సుందర్ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు మధు దళిత సీనియర్ న్యాయవాది లింగస్వామి, బార్ అసోసియేషన్ కార్యదర్శి కోటపాడు శ్రీను తదితరులు మాట్లాడుతూ పి శేఖర్ మరణం పత్రికా రంగానికి వామపక్ష ఉద్యమానికి తీరనిలోటని పై నాయకులు అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ ఆచార సంప్రదాయాలను లెక్కచేయకుండా తాను నమ్మిన తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి జీవించాడని పేర్కొన్నారు. నీస్వార్థపరుడు నిరాడంబరుడు అపార జ్ఞాన సంపద కలిగిన వాడు అన్ని వర్గాల ప్రజలతో అన్ని రాజకీయ నాయకులతో అన్యోన్యంగా మెలుగుతూ ఆదరాభిమానాలు చూరగొన్నాడు. ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. తనకున్న జ్ఞాన సంపదతో సమాజంలో జరిగే అవినీతి అక్రమాలపై అసాంఘిక కార్యకలాపాలపై తనదైన శైలిలో వార్తలు రాసి అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగుల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి అని పేర్కొన్నారు పత్రికా రంగంలో అనేకమంది. జూనియర్లకు ఆదర్శవాదిగా ఉంటూ వారికి మెళుకువలు నేర్పిన వాడిగా పేరు సంపాదించుకున్నాడు. కామ్రేడ్ పి శేఖర్ ఆశయాలను ఆదర్శాలను మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సంతాప సభలో పాల్గొన్న నాయకులు కోరారు. ఇంకా ఈ సంతాప సభలో హిజ్రాల సంఘం జాతీయ గౌరవాధ్యక్షులు విజయ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు చలం బాబు, సోమశేఖర్, రమేష్, బాల ఓబయ్య, గాజులపల్లె రవి, ట్రేడ్ యూనియన్ నాయకులు షణ్ముఖరావు, వాల్మీకి పోరాట సమితి నాయకులు పులికొండ నాగ‌రాజు, మద్దిలేటి, దస్తగిరి, నాగేంద్ర, పవన్, చంద్రశేఖర్ సోదరులైన ఆంజనేయప్రసాద్, పని కుమార్, ఏం సంజీవ్, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎస్ ఎం డి రఫీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనుంజయ, శ్రీనివాసులు, అబ్రహం లింకన్ తదితరులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. టిడిపి పట్టణ అధ్యక్షులు జిల్లెల్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.