నంద్యాల లయన్స్ క్లబ్ కు 2022-23 సంవత్సరానికి ఎన్నుకోబడిన నూతన కార్యవర్గం ఆదివారం స్థానిక మధుమణి సమావేశ భవనంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఈ సంవత్సరం చేపడుతున్న సేవా కార్యక్రమాలు వివరించారు. నంద్యాల లయన్స్ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్,కూర మురళి కృష్ణ ప్రసాద్, కోశాధికారి రత్న, సీనియర్ సభ్యులు డాక్టర్ రవికృష్ణ ,డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ 1970 సంవత్సరంలో ప్రారంభించబడిందని , 52 సంవత్సరాల సుధీర్ఘ సేవా ప్రస్థానంలో నంద్యాల పట్టణం ,పరిసర ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. 2 సంవత్సరాల క్రితం స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా నిర్వహించ లేకపోయామని, ఈ సంవత్సరం స్వర్ణోత్సవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. పట్టణానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 50 మందికి నంద్యాల లయన్స్ క్లబ్ స్వర్ణోత్సవ పురస్కారాలు అందించి సత్కరిస్తామని, 50 భారీ సేవా కార్యక్రమాలు వైద్య, విద్యా ,సాంస్కృతిక, క్రీడా,సామాజిక రంగాలలో చేపడతామని అన్నారు. స్వర్ణోత్సవ సావనీరు ప్రచురించి విడుదల చేస్తామని అన్నారు. తమ సేవా కార్యక్రమాలకి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మీడియా సహకారం అభ్యర్థించారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 26 వ తేదీ ఆదివారం స్థానిక బాలాజీ కళ్యాణ మంటపం లో నిర్వహిస్తున్నామని,రాష్ట్ర లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు పర్వతనేని సుభాష్, మూల్పూరు ఉపేంద్ర, ఏ.వి.ఆర్.ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని డాక్టర్ రవి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు ఆడిటర్ గోపాల్, డాక్టర్ వినోద్, శ్రీకాంత్, కశెట్టి చంద్రశేఖర్, మహేశ్వర రెడ్డి, మనోహర రెడ్డి, కశేట్టి వేణుమాధవ్, ఎం.పీ.వి. రమణయ్య, బాబురావు,డాక్టర్ రాజీవ్, డాక్టర్ శ్రవన్ తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

నంద్యాల లయన్స్ క్లబ్ స్వర్ణోత్సవ సేవా కార్యక్రమాలు
- Post published:June 19, 2022
- Post category:Nandyal