You are currently viewing ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందించండి

ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందించండి

  • Post category:Nandyal
  • ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలలో ప్రగతి సాధించండి
  • రాష్టంలోనే నంద్యాలను ఆదర్శ జిల్లాగా తీసుకురండి
  • జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

నంద్యాల: ప్రభుత్వ సేవలు ప్రతి గడపకు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే జిల్లాల పునర్విభజన చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చారిత్రాత్మక నిర్ణయం ముకున్నారని ఈ మేరకు జిల్లా అధికారులు అందరు అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి రాష్ట్రంలోనే జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ రాత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. శనివారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని ) వైఎస్సార్ సంచసరి పలులో కొత్తగా ఏర్పడైన నంద్యాల జిల్లాలో ముత్వ కార్యాలయాల పరిస్థితి కబాయించిన సిబ్బంది. ఇతర మ క సదుపాయాల పై తొలి సాంగా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మ సంద రెడ్డి, ఎమెల్సి ఇషాక్ బాషా, జిల్లా కలెక్టర్ డాక్టర్ మసజీర్ జిలాని సామూస్, మునిసిపల్ ఛైర్మన్ మాబున్నిసా, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజల సేవ కోసమే పని చేస్తున్నామని… చేస్తున్న పనిని పారదర్శకంగా చేపట్టి ప్రజలకు జవాబుదారీతనంగా బాధ్యతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా జిల్లా ఏర్పాటై నెల రోజులు గడిచిపోయిందని… ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో నిమగ్నమై ప్రజా సేవ చేసేందుకు అదృష్టంగా భావించి… ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రగతిపై దృష్టిసారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. కొత్త జిల్లాల, డివిజన్ల ఏర్పాటుకు ముందు ప్రభుత్వం భారీస్థాయిలో విశ్లేషించి అన్ని రకాల వర్గాల వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు నూతన జిల్లాల పక్రియ చేపట్టడం జరిగిందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కేంద్రం నుంచి వచ్చే పథకాలు సద్వినియోగం చేసుకునే అవకాశం వుంటుందన్నారు. నంద్యాల జిల్లాలో డోన్ నియోజక వర్గం మినహా మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో సాగునీటి ప్రాజెక్టులు, సారవంతమైన భూములు, యువతకు ఉపాధి అవకాశాలు వున్నాయని అన్ని జిల్లాల కంటే నంద్యాల జిల్లా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం వుందన్నారు. భవిష్యత్ లో నంద్యాల రాష్ట్రంలోనే ఒక ఆదర్శ జిల్లాగా పేరు పొందేందుకు జిల్లా అధికారులు అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ పూర్వపు విద్యా విధానం, ఫైలింగ్ సిస్టం, డ్రాఫ్టింగ్ తదితర అంశాల్లో అత్యంత వెనుకబడిన ఉన్నామని… ఆత్మపరిశోధన చేసుకుని అధికారులందరూ మానసికంగా శ్రద్ధ ఉంచి నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని మంత్రి సూచించారు. కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, కొరతగా ఉన్న సిబ్బంది తదితర అంశాలపై నివేదికలు అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో 90 శాఖలకు చెందిన అధికారుల కార్యాలయాలు, సిబ్బంది కేటాయించబడి వసతి సమకూర్చుకున్నారని మంత్రికి వివరించారు. బిఎస్ఎన్ఎల్ రెసిడెన్షియల్ క్వార్టర్స్లో 18 డిపార్ట్మెంట్ లకు ప్లాట్లు కేటాయించామని మిగిలిన వారు తమ పరిధిలోని డివిజనల్ కార్యాలయాల్లో సర్దుబాటై విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. పంచాయతీ రాజ్, డ్వామా శాఖల మినహా మిగిలిన అన్ని శాఖల కేటాయింపు జరిగిందన్నారు. శాఖల వారీగా కార్యాలయాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలపై నివేదికలు సేకరించామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు స్వీకరించి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. అంతకు ముందు మంత్రి ఇ జిల్లా అధికారులు పరిచయం చేసుకుంటూ వారికి కావలసిన మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత, తదితర అంశాలపై క్షున్నంగా అడిగి తెలుసుకున్నారు.మునిసిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా మాట్లాడుతూ నంద్యాల పురపాలక సంఘంలో అమృత్ పథకం కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని నిధులు కేటాయించి స్కీమ్ కొనసాగించాలని మంత్రిని కోరారు. అలాగే మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బంది కొరత ఉందని అదనంగా సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని మున్సిపల్ కమిషనర్ వెంకట మంత్రికి నివేదించారు. ఈ సమావేశంలో నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, దాస్, అన్ని డిపార్ట్మెంట్ల జిల్లా స్థాయి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం యంత్రాంగం తరపున మంత్రి, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్ పర్సన్ లకు అధికారులు సన్మానం చేశారు.