You are currently viewing సీనియర్ పాత్రికేయుడు పి చంద్రశేఖర్ సంతాప సభ కరపత్రాల విడుదల

సీనియర్ పాత్రికేయుడు పి చంద్రశేఖర్ సంతాప సభ కరపత్రాల విడుదల

  • Post category:Nandyal

సీనియర్ జర్నలిస్టు పి చంద్రశేఖర్ జూన్ 3వ తేదీ అకాల మరణం పట్లవామపక్ష పార్టీలు పాత్రికేయులు ప్రజా సంఘాలు న్యాయవాదులు తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ సంతాపసభ ఆదివారం అనగా 19 3 2022 నిశాంత్ భవన్ ఎమ్మార్వో ఆఫీస్ వెనక నందు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సంతాపసభకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం పత్రికలకు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి శంకర్, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కె.చంద్ర, ఎస్.బాలఓబయ్య, గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు రాజ్ నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ ఆదివారం జరిగే చంద్రశేఖర్ సంతాపసభకు అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు, పాత్రికేయ మిత్రులు, న్యాయవాదులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరారు.