నంద్యాల లయన్స్ క్లబ్ కు 2022 -2023 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడిగా శ్రీరామ డిజిటల్ అధినేత చందా చంద్రమోహన్, కార్యదర్శిగా కూర ప్రసాద్ , కోశాధికారిగా రత్న ఎంపికయ్యారు. డాక్టర్ రవి కృష్ణ,ఏ వి ఆర్ ప్రసాద్, డాక్టర్ సహదేవుడు, ఆడిటర్ గోపాల్, శ్రీకాంత్, రవి ప్రకాష్, కసెట్టి చంద్రశేఖర్ , భవనాసి మహేష్ లతో ఏర్పడిన ఎన్నికల కమిటీ క్లబ్ సభ్యులతో సంప్రదించి నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా షావలి రెడ్డి, బింగుమల్ల శ్యాంసుందర్ గుప్తా, ఉపేంద్ర రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా ఇమ్మడి రామకృష్ణ, సుధాకర్ రావు వివిధ కార్యక్రమాల కమిటీలకు సభ్యులు చైర్మన్లుగా ఎంపికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారిలను క్లబ్ సభ్యులు అభినందించారు.
