You are currently viewing ఓటర్ల జాబితాలో సవరణలు చేపట్టండి

ఓటర్ల జాబితాలో సవరణలు చేపట్టండి

  • Post category:Nandyal

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

ఓటర్ల జాబితాలో తప్పొప్పుల సవరణకు స్వీకరించిన విజ్ఞప్తులు, ఆక్షేపణలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విజయవాడ ఎన్నికల కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ల జాబితా, ఎన్నికల ఫిర్యాదులు తదితర అజెండా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, డిఆర్ఓ పుల్లయ్య, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు వెంకటరెడ్డి, ఎం.కె.దాసు, మండల తహసీల్దార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో సవరణకు 33,088 దరఖాస్తులు వచ్చాయని రాబోయే 10 రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేస్తామని వివరించారు. జిల్లాలో 1604 మంది బూత్ స్థాయి అధికారులు, డీఈఓ, ఈఆర్ఓ, ఎఈఆర్ఓల నియమించి సంబంధిత ప్రతిపాదనలు ఎన్నికల కార్యాలయానికి సమర్పించామన్నారు. చురుకుగా పనిచేస్తున్న బూత్ స్థాయి అధికారులను గుర్తించి నివేదిక సమర్పిస్తామన్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల నుండి ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించలేదన్నారు. ఉత్తమ ప్రతిభ ఉన్న బూత్ లను గుర్తించి విజయగాధలు తయారు చేస్తామని కలెక్టర్ తెలిపారు.