You are currently viewing టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

  • Post category:Nandyal

-మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

  • ఆళ్లగడ్డలో కొనసాగుతున్న బాదుడే బాదుడు కార్యక్రమం
  • వైకాపా ప్రభుత్వంలో ధరలు బాదుడే బాదుడు
  • సామాన్యుడు బతకలేని స్థితి లో వైకాపా ప్రభుత్వం పాలన

వైకాపా ప్రభుత్వం ధరలు బాదుడే బాదుడు సామాన్యుడు బతకలేని స్థితి లో ఈ ప్రభుత్వం కొనసాగుతుందని ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని సాగనంపి 2024లో ప్రజా ప్రభుత్వం అయినా టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం అన్నారు. మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలోని వి.ఎమ్‌.నగర్ కాలనీలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భూమా జగత్ విద్యుత్ రెడ్డి. భూమా భార్గవ్ రాము అధిక సంఖ్యలో భూమా అభిమానులు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల పన్నులతో నానా అవస్థలు పడుతున్న వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యా అని ఆమె ప్రశ్నించారు అమ్మ ఒడి కి 300 యూనిట్లు దాటితే అనర్హులని అనటం చాలా బాధాకరమని అన్నారు అవగాహన లేని పాలనతో రాష్ట్రం వెళ్తుందో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. వేళాపాళా లేని కరెంటు కోతలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రజలపై ఆంక్షలు కోతలు విధిస్తూ పేద మధ్యతరగతి ప్రజలపైమట్టి పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల లబ్ధి చేకూరుతుందని చెప్పటం ప్రజలను మోసం చేయడమేనని ఆమె అన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ చార్జీలు విద్యుత్ చార్జీలు నిత్యావసర సరుకులధరలు. చెత్త పన్నుల తొ మరియు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో సామాన్య ప్రజలపై 3 లక్షల రూపాయల భారం పడుతుందని అన్నారు. ఒక పేద, మధ్యతరగతి కుటుంబం బతకడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం లో నెలకు 11 వేలు సరిపోయేది ప్రస్తుత వైయస్సార్సీపి ప్రభుత్వంలో 25 వేల రూపాయలు కూడా మధ్యతరగతి కుటుంబానికి సరిపోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలు నిత్యావసర ధరలు పన్నుల భారం పోవాలంటే జగన్ ప్రభుత్వం దిగి పోలి ఉందని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శుద్ధ పల్లి చాంద్ బాష, బాఛపురం శేఖర్ రెడ్డి, తెలుగు యువత నాయకులు నన్ను బైగారి జిలాని, మల్లికార్జున రెడ్డి, నూర్జహాన్, రామ శేఖర్ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.