You are currently viewing రైతులకు భీమా పరిహారం చెల్లింపు

రైతులకు భీమా పరిహారం చెల్లింపు

  • Post category:Nandyal

ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లాలో 89,201 మంది రైతులకు రూ. 123,55,95,751 లను పంటల బీమా పరిహార సొమ్మును విడుదల చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. మంగళవారం వ్యవసాయ పరిశోధన స్థానంలోని వైయస్సార్ సెంటినరీ హాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద 2021 ఖరీఫ్‌ లో పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు రూ. 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేసే మహత్తర కార్యక్రమాన్ని లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జిల్లా వ్యవ వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, భీమా పొందిన రైతులు తిలకించారు. జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ఖరీఫ్ 2021లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన 89,201 మంది రైతులకు రూ.123,55,95,751 లను పంటల బీమా పరిహార సొమ్మును విడుదల చేశామన్నారు. డా. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారం రు. 123.56 కోట్ల మెగా చెక్కును జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవ వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషాలు రైతులకు అందచేశారు. జిల్లా వ్యవ వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుబిడ్డగా రైతన్నలను ఆదుకోవడమే పరమావధిగా పెట్టుకొని ఈ ఖరీఫ్ సీజన్ కు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని ఒక రైతుగా తాను భావోద్వేగానికి గురవుతున్నానన్నారు. రైతులే ఈ రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థ వెన్నముకని గుర్తుకు తెస్తూ రైతాంగం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. శాసనమండలి సభ్యులు ఇసాఖ్ బాషా మాట్లాడుతూ రైతు పక్షపాతి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతన్నల కోసం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రకటించిన దానికంటే ముందుగా అమలు చేస్తున్నారన్నారు. తాను కూడ రైతునని… గతంలో రుణం కోసం బ్యాంకులకు వెళ్తే ఇన్సూరెన్స్ చేస్తే తప్ప రుణం మంజూరు చేసేవారు కాదన్నారు. గత పది సంవత్సరాలుగా పంటకు ఇన్సూరెన్స్ చేసినా పరిహారం అందేది కాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ చేసి ఎలాంటి నష్టం వాటిల్లినా రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, జిల్లా ఉద్యాన శాఖాధికారి రమణ, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.