You are currently viewing రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే

రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే

  • Post category:Nandyal
  • అభివృద్ధికి మారుపేరు తెలుగుదేశం ప్రభుత్వం
  • ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపా ప్రభుత్వం

బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫోటో రైట్ అప్ 1. ప్రజలతో కరచాలనం చేస్తున్న భూమా అఖిలప్రియ నంద్యాల ప్రతినిధి న్యూస్ : సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మూడు సంవత్సరాల నుండి అన్ని వర్గాల ప్రజల విశ్వాసం కోల్పోయిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. సోమవారం తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా 5,6 వార్డులలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు. ఇంటి ఇంటికి వెళ్లి ఆమె ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టలేక పోయిందని, దీనికి తోడు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు ఆర్థికంగా మరింత భారాన్ని పెంచిందన్నారు. అమ్మ వడి పేరు తో తల్లులకు నగదు బదిలీ చేస్తున్నా ఇచ్చేది గోరంతా తీసుకున్నది కొండంతగా ఈ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. సంక్షేమ పాలన చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కొందరికి మాత్రమే లబ్ధి కలిగిస్తూ మరి కొందరికి సాకులు చూపి పథకాలు ఇవ్వని దుస్థితి ఉందన్నారు.ఇసుక, సిమెంటు ధరల పెంపు సామాన్య మానవునికి ఇల్లు కట్టుకోవడం భారంగా మారిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలకు భారం మీద భారం పడుతుందన్నారు. ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థ లోనే ప్రక్షాళన చేపట్టి అభాసుపాలైందన్నారు. పది ఫలితాల్లో రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఫెయిల్ కావడం ఈ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు. పట్టణంలో వార్డులలో అభివృద్ధి జరగలేదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా అన్న చందంగా తయారైందన్నారు. గెలిచిన వైకాపా కౌన్సిలర్లు తమ వార్డులలో అభివృద్ధి పై పెదవి విప్పకపోవడం బాధాకరమన్నారు. రానున్న రోజుల్లో వైకాపాకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భూమా జగద్విఖ్యాత రెడ్డి, భార్గవ్ రామ్ నాయుడు, బాచ్చాపురం శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి చాంద్ భాష, నన్నెభై గారి జిలాని తదితరులు పాల్గొన్నారు.