You are currently viewing పోలీస్ స్పందన కార్యక్రమానికి 92 ఫిర్యాదులు

పోలీస్ స్పందన కార్యక్రమానికి 92 ఫిర్యాదులు

  • Post category:Nandyal

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్దగల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో సామాన్య ప్రజలు వివిధ రకాల కారణాలతో వచ్చే బాధితుల సమస్యలు నేరుగా తెలుసుకోవడం ద్వారా వాటి త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆర్.రమణ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల మస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి చట్ట పరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, అన్నదమ్ముల మధ్య ఆస్థి తగాదాలు, అత్తారింటి వేధింపులు, సివిల్ తగాదాలు ఉన్నాయి. ఓంకారం దేవస్థానం వారు వచ్చిన ఫిర్యాదిదారులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీతోపాటు ఎస్ఐ రాజ్ కుమార్ పాల్గొన్నారు.