You are currently viewing ఆళ్లగడ్డలో జనసేన సభ్యత్వం కిట్ల పంపిణీ

ఆళ్లగడ్డలో జనసేన సభ్యత్వం కిట్ల పంపిణీ

  • Post category:Nandyal

ఆళ్లగడ్డలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఐడీ కార్డులను కిట్లను ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో ఆదివారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ళగడ్డ పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం ఆళ్లగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయబ్ కమల్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని ముఖ్య అతిథులుగా క్రియాశీల సభ్యత్వ కిట్ల జనసేన సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు అందజేశారు. ఆళ్ళగడ్డ జనసేన నాయకులు, రాష్ట్ర నాయకులకు అహోబిలం బైపాస్ రోడ్ నుండి మీటింగ్ హాల్ వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. మీడియాతో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన పార్టీకి పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రమాద భీమా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రమాద రూపంలో గాయపడిన 50 వేల రూపాయలు మెడికల్ ఫీజు కార్యకర్తల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ అండగా నిలవడానికి దేశంలో ఏ పార్టీ ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ కల్పించారని తెలియజేశారు. రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయక్ కమల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని ప్రతి ఒక్క జన సైనికుడు పవన్ కళ్యాణ్ లాగా పనిచేసి 2024లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసే దిశగా పని చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ కార్యదర్శి ఆకేపాటి సుభాషిని మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ ఐ డి కార్డు, ఇన్సూరెన్స్ బాండ్లు, పవన్ కళ్యాణ్ మనోగతం సంబంధించి బుక్లెట్, బైక్, ఆటో స్టిక్కర్స్, ఎనిమిది రకాల వస్తువులను అందజేశారు. మహిళలను కూడా రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో క్రియాశీల అత్యధిక సభ్యత్వాలు చేసిన జనసేన నాయకులను జనసేన కండువాలతో సన్మానం చేసి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చల్లా వరుణ్, విశ్వనాధ్, హసీనా బేగం, మైలేరి సురేఖ, రామిశెట్టి కుమార్ పశువుల, నరేంద్ర యాదవ్, చలివెందుల రాజారామ్, బావికాడి గుర్రప్ప, రాచరంశెట్టి వెంకటసుబ్బయ్య, మాబుహుస్సేన్, బాబు, జమాల్ బాష, కేశవ తదితర నాయకులు పాల్గొన్నారు.