You are currently viewing ఆదివారం నంద్యాలలో తెలుగు రాష్ట్రాల యూరాలజీ వైద్య సదస్సు

ఆదివారం నంద్యాలలో తెలుగు రాష్ట్రాల యూరాలజీ వైద్య సదస్సు

  • Post category:Nandyal

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల యూరాలజీ వైద్యుల సంఘం పర్యవేక్షణలో,నంద్యాల, కర్నూల్ జిల్లాల యూరాలజీ వైద్యుల సంఘం నిర్వహణలో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు నంద్యాలలో రెండు తెలుగు రాష్ట్రాల యూరాలజీ వైద్యుల వైజ్ఞానిక సదస్సు స్థానిక సురేష్ గ్రాండ్ హోటల్ లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల యూరాలజీ వైద్యుల సదస్సు నిర్వహణ కార్యదర్శి డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఐఎంఏ డాక్టర్ రవి కృష్ణ, నిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సదస్సు వివరాలు తెలియజేశారు. డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో రాష్ట్రస్థాయి యూరాలజీ వైద్యుల వైజ్ఞానిక సదస్సు నిర్వహించడం ఇదే ప్రథమమని,సదస్సులో యూరాలజీ వైద్యరంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, వాటిని వినియోగించే విధానం, చికిత్సలో ఎదుర్కొనే సమస్యలు, పర్యవసానాల గురించి 24 అంశాలపై చెన్నై,బెంగళూరు,హైదరాబాద్, తదితర నగరాలకు చెందిన యూరాలజీ వైద్య రంగ ప్రముఖులు ప్రసంగిస్తారని. ఈ సదస్సులోరెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి యూరాలజీ వైద్య నిపుణులు, యూరాలజీ పీజీ వైద్య విద్యార్థులు 200 మంది హాజరు అవుతున్నారన్నారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, ఐ ఎం ఎ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవి కృష్ణ అతిథులుగా పాల్గొని సదస్సు ప్రారంభిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులుగా మాజీ రాష్ట్ర ఐఎమ్ఏ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ రెడ్డి పాల్గొంటున్నారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ యూరాలజీ వైద్యరంగంలో వచ్చిన ఆధునిక మార్పులు తెలుసుకోవడానికి తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఈ సదస్సులు ఉపయోగపడతాయని అన్నారు. నంద్యాల జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత ఇంత పెద్ద స్థాయి వైద్య సదస్సు నంద్యాలలో నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సదస్సులో సీనియర్ యురాలజి వైద్య నిపుణులు సదస్సు ప్యాట్రన్ డాక్టర్ విక్రమసింహా రెడ్డి , చైర్మన్ డాక్టర్ గోవింద రెడ్డి,అధ్యక్షులు డాక్టర్ సీతారామయ్య పాల్గొంటున్నారని, యురాలజి విభాగంలోని మూత్ర పిండాలు, మూత్రాశయం, మూత్ర నాళ సమస్యలకు పెద్ద నగరాల ఎన్ఎమ్‌ స్థాయిలో నంద్యాలలో నిపుణులు, ఆధునిక ప్పపరికరాలు, వసతులు అందుబాటులో ఉన్నాయనీ , ఇటువంటి సదస్సుల ద్వారా వైద్యుల పరిజ్ఞానం మెరుగవుతుందని అన్నారు.