You are currently viewing అర్ జి యం ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగి కే భూపాల్ రెడ్డి ని విధుల్లోకి తీసుకోవాలి

అర్ జి యం ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగి కే భూపాల్ రెడ్డి ని విధుల్లోకి తీసుకోవాలి

  • Post category:Nandyal

ఆవాజ్ జిల్లా కన్వీనర్ ఎస్ మస్తాన్ వలి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించి కె భూపాల్ రెడ్డి గారిని ఆర్ జి యం ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి ఆర్ జి యం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభం 1995 సంవత్సరం నుండి నేటి వరకు 27 సంవత్సరములు తక్కువ వేతనంతో పనిచేస్తూ వచ్చినారు జీతాలు పెంచాలని మరియు ప్రభుత్వం ప్రకటించిన జాతీయ సెలవు లన్నిటిని ఇవ్వాలని కోరుతూ సంఘటితంగా ఉండేందుకు అందరినీ కలుపుకొని చేస్తుండగా తన సామాజిక వర్గం వారిని లోబరుచుకుని నన్ను మానసికంగా వేధిస్తున్నారని డి.సి.ఎల్‌ కర్నూల్ వారిని గతంలో సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కోరిన న్యాయం జరగలేదు నంద్యాల జిల్లా అయిన వెంటనే విధుల నుండి తొలగించారు చట్ట ప్రకారం ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో ఇస్తున్నా వేతనాలతోపాటు అన్ని వసతులు కల్పించాలి రిటైర్డ్ అయిన తర్వాత గ్రాట్యుటీ ఇవ్వాలి ఇవి ఏమి ఇవ్వడంలేదని ప్రశ్నించినా కె.భూపాల్ రెడ్డిని ఆర్ జి యం ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం విధుల నుండి తొలగించడం జీవించే హక్కును హరించడమే అని జీతం పై ఆధారపడి తుకుతున్నాడు. భూపాల్ రెడ్డి గారితో పాటు భార్య పిల్లలు ఉన్నారు అందరి జీవితాలను అన్యాయం చేస్తున్న ఆర్ జి యం ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యంపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం జోక్యం చేసుకొని వారి కుటుంబానికి న్యాయం చేయాలని తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లుగా చర్యలు తీసుకోవాలని అవాజ్ జిల్లా కన్వీనర్ ఎస్ మస్తాన్ వలి, ప్రజా సంఘాల వారు తెలిపినారు