You are currently viewing వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించడం దుర్మార్గమైన చర్య

వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించడం దుర్మార్గమైన చర్య

  • Post category:Nandyal
  • నీతి కబురలతో, అబద్దపు వాగ్దానాల తో గద్దెనెక్కి నోట్ల రద్డుతో కోట్ల మంది కడుపుకొట్టి దేశ సంపదను తమ మిత్రులకు దోచిపెట్టే నిర్ణయల సూత్రధారులు మోడీ – అమిత్ షాలు ఆలోచన విధానాన్ని ప్రశ్నిద్దాం
  • అవకతవకల జీఎస్టీ బిల్లు తీసుకొచ్చి దేశ వాజిజ్యాన్ని కుదేలయ్యేలా చేశారు
  • దేశములో మరియు రాష్ట్రములోజగన్ రెడ్డి పాలనలో దళిత, గిరిజన,ముస్లిం మైనార్టీలు, ఆదివాసీలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయి
  • రాష్ట్రములో విద్య వ్యవస్థను భ్రష్టు పట్టించారు
  • నంద్యాల డిసిసి అద్యక్షులు జంగిటి లక్ష్మీ నరస్సింహ యాదవ్
  • కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల జిల్లా రిటర్నింగ్ అధికారి భీమ్ భరత్

దేశములో,రాష్ట్రములో దుర్మార్గమైన పాలన సాగుతుందని,అబద్దపు వాగ్దానాల తో గద్దెనెక్కి నోట్ల రద్డుతో కోట్ల మంది కడుపుకొట్టి దేశ సంపదను అంత తమ మిత్రులకు దోచిపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థ ను సర్వ నాశనం చేస్తున్నారని,దళిత ,గిరిజన,ముస్లిం మైనారిటీ లపై అను నిత్యం దాడులు జరుగుతున్నాయని,ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష పార్టీ నేతలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని,కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అద్యక్షులు జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్,మరియు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల నంద్యాల జిల్లా రిటర్నింగ్ అధికారి భీమ్ భరత్ గారు విమర్శించారు,ఈ రోజు నంద్యాల పట్టణములో కాంగ్రెస్ పార్టీ కార్యాలయములో నంద్యాల పార్లమెంట్ పరిధిలో ని డోన్,బనగానపల్లె,పాణ్యం,నంద్యాల ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా బూత్ స్థాయి కమిటీ ల ఏర్పాటు ను పరిశీలించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రములో జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో ఇరుక్కుని అధోగతి అవుతున్నదని,విద్య వ్యవస్థను సర్వ నాశనము చేసి విద్యార్థుల జీవితాలతో అడుకుంటుంన్నారని,రైతులకు వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించడం దారుణమైన చర్య అని వారు దుయ్యబట్టారు, విచ్చలవిడి అక్రమ డబ్బు సంచులతో, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అండతో, ప్రసార మాధ్యమాలను పూర్తిగా లోబరుచుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, స్వాతంత్ర సమరయోధులు, నవభారత నిర్మాతలైన త్యాగమూర్తుల జ్ఞాపకాలను చెరిపేస్తూ చరిత్రకే వక్రభాష్యం చెబుతున్నారని,చైనా దురాక్రమణకు గురవుతున్న భారతదేశ సరిహాద్దులపై నోరు మెదపటం లేదని అత్యధిక పెట్రోల్, డీజీల్,నిత్యవసర,వంటగ్యాస్ ధరలతో దేశ ప్రజలపై పెట్రో బాంబ్ వేశారని, అణువణువునా అరాచకం, వాడ వాడల విధ్వంసంతో చెలరేగుతున్న వైకాపా రౌడీ రాజ్యంలో కుడిచేతి తో ఇచ్చి ఎడమ చేతితో తీసుకునే అక్కరకు రాని పధకాల వల్ల,రాష్ట్రం అధోగతి పాలు అయిందని, మద్యపాన నిపేధాన్నికాస్తా మద్యపానాంధ్రప్రదేశ్ గా మార్చి మాట తప్పి నాడు ఒకే రాజధానిగా అమరావతికి సై అని చెప్పి నేడు మూడు రాజధానులంటూ మాట మార్చి మడం తిప్పి అమరావతికి నై అని, అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేస్తాం అని చెప్పి,పిఆర్ సి అమలు చేస్తాం అని చెప్పి మాట తప్పిన వ్యక్తి జగన్ రెడ్డిని,
విభజన హోమీలైన ప్రత్యేక హోదా ,స్టీల్ ప్లాంట్, పోలవరానికి జాతీయ హోదా ,రాజధాని అభివృద్ధి,కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, కృష్ణపట్నం పోర్ట్, మొదలైన సాధించలేని జగన్ రెడ్డిపార్టీ,పోరాడలేని టిడిపి పార్టీ,ఇవ్వలేని బిజెపి పార్టీలను వచ్చే ఎన్నికలలో ఇంటికి సాగనంపాలని, వారు పిలుపునిచ్చారు.ఈ కార్య క్రమములో నంద్యాల పట్టణ అద్యక్షులు దాసరి చింతలయ్య,పీసీసీ ప్రధానకార్యదర్శి చింతల మోహన్ రావు,నంద్యాల డిసిసి ప్రధానకార్యదర్శి డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి,రాష్ట్ర స్పోక్స్ పర్సన్ వాసు,డిసిసి కార్యదర్శి యు.జనార్దన్,రాష్ట్ర ఎస్సి సెల్ కన్వీనర్ బాలకృష్ణ,నంద్యాల నియోజకవర్గం సమన్వయ కర్త ఫరూక్,డిసిసి సహాయ కార్యదర్శి రహిమాన్,బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి నగరాజ్,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ లక్ష్మన్న,డిసిసి కార్యదర్శి బాలు,ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు. డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త గా డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి నియామకం నంద్యాల పార్లమెంట్ పరిధిలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి పిసిసి ఆదేశాల మేరకు చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన ఉన్నతవిద్యావంతుడు,పార్టీకి విధేయుడు అయిన డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి నియమించడం జరిగిందని నంద్యాల డిసిసి అద్యక్షులు శ్రీ జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ ఒక ప్రకటనలో తెలియచేశారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నీతి నిజాయితీగా కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్త ను పార్టీ గుర్తిస్తోందని,డోన్ నియోజక వర్గములో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు కోరారు,నా మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన మా పీసీసీ,నంద్యాల డిసిసి అద్యక్షులు శ్రీ జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియ చేశారు.ఈ కార్య క్రమములో నంద్యాల పట్టణ అద్యక్షులు దాసరి చింతలయ్య,పీసీసీ ప్రధానకార్యదర్శి చింతల మోహన్ రావు,రాష్ట్ర స్పోక్స్ పర్సన్ వాసు,డిసిసి కార్యదర్శి యు.జనార్దన్,రాష్ట్ర ఎస్సి సెల్ కన్వీనర్ బాలకృష్ణ,నంద్యాల నియోజకవర్గం సమన్వయ కర్త ఫరూక్,డిసిసి సహాయ కార్యదర్శి రహిమాన్,బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి నగరాజ్,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ లక్ష్మన్న,డిసిసి కార్యదర్శి బాలు,ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.