You are currently viewing విదేశాల్లో దేశ ప్రతిష్టను భంగం కలగజేసిన నూపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ను అరెస్టు చేయాలి

విదేశాల్లో దేశ ప్రతిష్టను భంగం కలగజేసిన నూపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ను అరెస్టు చేయాలి

  • Post category:Nandyal

అవాజ్ జిల్లా కన్వీనర్ సిపిఎం జిల్లా నాయకులు ఎస్ మస్తాన్ వలి మహమ్మద్ ప్రవర్తపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ ను వారి పార్టీలో సస్పెండ్ చేసి పోలీసుల రక్షణ కల్పించడం కాదు అరెస్ట్ చేయాలని సిపిఎం జిల్లా నాయకులు అవాజ్ జిల్లా కన్వీనర్ ఎస్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు విదేశాల్లో మన దేశ లౌకిక రాజ్యాంగ వ్యవస్థకు భంగం కలిగినట్లు మాట్లాడి దేశ ప్రతిష్ఠకు భంగం కలుగ జేసిన నవీన్ కుమార్ మరియు నూపూర్ శర్మను అరెస్టు చేయాలని సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల అగ్ర నాయకులు వారందరూ ఢిల్లీలో డిమాండ్ చేసిన అరెస్టు చేయలేదు నంద్యాల‌లో జ్ఞాన పిపాసి వివాదాస్పద వ్యాఖ్యలు మసీదు మందిరంపై చేసినారని పట్టణ టిడిపి కార్యదర్శి సోహెల్ రానా పై కేసు పెట్టిన వారు అక్కడ ఎందుకు పెట్టలేదని మస్తాన్ వలి ప్రశ్నించారు. విదేశీ అరబ్ దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు. మన దేశానికి కి విదేశీ నిధులు 50% వస్తున్నాయి అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. వాటన్నిటిని నష్టం చేసిన నూపూర్ శర్మను నవీన్ కుమార్ జిందాల్ ను అలాంటివారిని అరెస్టు చేయాలి వీరివలన కాన్పూర్ లో మత ఘర్షణలు జరిగినవి ఉద్దేశ పూరిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ప్రధాని మోడీ నోరు మెదపకపోవడం ఎంపీగా ప్రధానిగా రాజ్యాంగంపై ప్రమాణాలు చేసిన దానికి విరుద్ధంగా ఉందని ఎస్ మస్తాన్ వలి అవాజ్ జిల్లా కన్వీనర్ సిపిఎం జిల్లా నాయకులు తెలిపినారు.